ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

ఏటూరునాగారం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ రాంనాథ్‌ కేకన్‌ స్థానిక ఏఎస్పీ మనన్‌ భట్‌తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఐ జీడీ సూర్యప్రకాశ్‌, ఎస్సై మహేశ్‌లకు రికార్డుల నిర్వహణ, కేసుల ఫైలింగ్‌పై ఎస్పీ సూచనలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణ, రిసెప్షన్‌, వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు, సీసీటీఎన్‌ఎస్‌ అప్డేషన్‌, కేసు ఫైళ్ల నిర్వహణ, వివిధ నేరాలలో స్వాధీనం చేసుకుని నిరుపయోగంగా ఉన్న వాహనాలు, సిబ్బంది నివాస గృహాలు, స్టోర్‌ రూమ్‌, బెల్‌ ఆఫ్‌ రూమ్స్‌ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన ఫైళ్లను క్రమబద్ధంగా నిర్వహించాలని, పోలీస్‌ స్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ భద్రపర్చాలని సీఐ సూర్యప్రకాశ్‌, ఎస్సై మహేశ్‌లను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓర్పుతో విని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌ పనితీరులో పూర్తి పారదర్శకత పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. స్టేషన్‌ పరిశుభ్రత, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

యువతకు ఉచిత శిక్షణ

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ శిక్షణ తరగతుల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం 7వేల పోలీస్‌ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞలైన అర్హత కలిగిన అధ్యాపకులు, పిజికల్‌ ట్రైనర్లతో రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మారుమూల, గిరిజన గ్రామాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోచింగ్‌ ప్రారంభ తేదీ, స్థలం ఇతర పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వివరించారు. యువతీయువకులు తమ సమీప పోలీస స్టేషన్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement