ములుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ ఆధ్వర్యంలో బండారుపల్లి క్రాస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై తన పేరుమీద ఒక మొక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలన్నారు. ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పచ్చని వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ చింతలనిప్పుల చంద్రకళ మాట్లాడుతూ ములుగును మరింత పచ్చదనంతో నింపేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలాభివృద్ధిలో సర్పంచులే కీలకం
గ్రామాలాభివృద్ధిలో సర్పంచులే కీలకపాత్ర పోషించాలని, 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో గురువారం నిర్వహించిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పాలన, చట్టాలు, విధివిధానాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనతో పాటు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క


