స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

ములుగు: ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జీఎం ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో తేజస్‌ వర్క్‌షాప్‌ మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం ఇండస్ట్రీస్‌ జనరల్‌ మేనేజర్‌ సిద్ధార్థ రెడ్డి అధ్యక్షత వహించగా బాదం ప్రవీణ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత వినియోగం, యువతలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏపీడీ శ్రీనివాస్‌, డీపీఎం దేవానందం, ఎంఎస్‌ఎంఈ నుంచి ధనుంజయ్‌, టీజీఐసీ నుంచి రమేష్‌, ఆర్‌ఐసీహెచ్‌ నుంచి చరణ్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి మోహన్‌ పాల్గొన్నారు.

‘ఇసుక లారీలను అడ్డుకుంటాం’

వెంకటాపురం(కె): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెంకటాపురం మండల కేంద్రం మీదుగా వెళ్లే ఇసుక లారీలను అడ్డుకుంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. మండల పరిధిలోని ఆలుబాకలో మంగళవారం సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండల కేంద్రం నుంచి ఎదిర వరకు ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరమ్మతులు ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చే ఇసుక లారీలు వెంకటాపురం మీదుగా వస్తే మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్యానం వాసు, ఆదినారాయణ, రాంబాబు, కట్ల నర్సింహాచారి, వీరవేణి తదితరులు పాల్గొన్నారు.

కందకాలు తవ్వితే ఉద్యమిస్తాం

ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీస్తే ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఈ మేరకు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, రైతులు, గిరిజనులు మంగళవా రం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ ఏపీఓ ప్రతాప్‌కు నాయకులు అందజేశారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలోని గంటలకుంట గ్రామానికి చెందిన గిరిజనులు 25 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపా రు. ఆ భూముల్లో ఫారెస్టు అధికారులు కందకాలు తీయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటల సాగుకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తొలెం కృష్ణయ్య, బాడిష సమ్మయ్య, నగేశ్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ అడ్మిషన్లు పూర్తి

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికైన బాలుర ధ్రువపత్రాలను డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డీవైఎస్‌ఓ స్వాగతం పలికారు. అడ్మిషన్‌ ప్రక్రియ, హాస్టల్‌ వసతి, నాణ్యమైన క్రీడా శిక్షణ, సౌకర్యాల గురించి వివరించారు. ఎంపికై న వారికి క్రీడా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement