అనుమతిలేని జలపాతాలకు రావద్దు | - | Sakshi
Sakshi News home page

అనుమతిలేని జలపాతాలకు రావద్దు

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా

వాజేడు: రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్న అనుమతులు లేని జలపాతాలకు పర్యాటకులు రావద్దని డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా అన్నారు. మండల పరిధిలోని దూలాపురం సమీప గుట్టల్లో ఉన్న మాసన్‌లొద్ది జలపాతంలో యాద వైభవ్‌ కుమార్‌(18) మునిగి మృత్యువాత పడటంతో గురువారం ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ వాజేడు మండలంలో వర్షం కురువగానే గుట్టల వెంట జలపాతాలు జాలువారుతున్నాయని వివరించారు. అవి దట్టమైన అడవిలో ఉండటంతో వాటి సందర్శనకు అనుమతులు లేవన్నారు. గ్రామాల వద్ద చాలా దారులు ఉండటంతో ఏదో ఒక దారిలో పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారని వివరించారు. శత్రువు అవుతున్నారని, అనుమతులు లేని జలపాతాలకు వెళ్లడం చట్ట ప్రకారం నేరమని పర్యాటకులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వాజేడు మండలంలో కేవలం బొగత జలపాతానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని పర్యాటకులు అక్కడికి మాత్రమే రావాలని కోరారు. అనుమతులు లేని జలపాతాలకు వెళ్లే దారిలో బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల వాల్‌ పోస్టర్లను వేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement