ములుగు: నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించిన తుదిదశ పనులు త్వరగా పూర్తిచేయాలని, నాణ్యతలో రాజీపడకుండా అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవన నిర్మాణ పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. తుది దశ పనులను త్వరితగతిన పూర్తి చేసి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ బోర్ఖడే
హేమంత్ సహదేవరావు


