భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన సీనియర్ మైనింగ్ సర్దార్‌లకు వెంటనే ఓవర్‌మెన్ గ్రేడ్–బీ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ.. ఓవర్‌మెన్ పోస్టులు ఖాళీ లేవని చెప్పి ప్రమోషన్లు నిలిపివేస్తూనే యాక్టింగ్ ఓవర్‌మెన్ విధులు చేయించడం అన్యాయమన్నారు. 2016–17 బ్యాచ్ అర్హులైన సీనియర్ మైనింగ్ సర్దార్‌లకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని, జేఎంఈటీ సిబ్బందికి కూడా శిక్షణ పూర్తయిన వెంటనే షార్ట్ ఫైరర్ లేదా సర్దార్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మైనింగ్ సిబ్బంది ఆసిఫ్‌పాషా, రామచందర్, సికిందర్‌సింగ్ పాల్గొన్నారు.


