రెండు రోజుల్లో పంపిణీ చేస్తాం..
ఏటూరునాగారం:పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల విద్యార్థుల గురించి గిరిజన సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ఇప్పటికీ నోట్‌బుక్స్ అందకపోవడంతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు రాసుకునేదెలా అని ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యా సంస్థలు 149 ఉన్నాయి. 8,528 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన హోం, క్లాస్ వర్క్ ఎందులో రాయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మాత్రం పాఠాలు చెబుతున్నాము.. నోట్స్ రాయాలి కాపీలు రాకుంటే మేము ఏం చేయాలని చేతులు దులుపుకుంటున్నారు.
నిరుపేద కుటుంబాలకు చెందినవారే..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నోట్‌బుక్స్ కొనుగోలు చేసి ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి ఉంది. నెలరోజులు కావస్తున్నా నోట్ బుక్కులు అందకపోవడంతో హోం వర్క్ ఒకేసారి చేయాలంటే ఎలా రాస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పీఓ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు నోట్‌బుక్స్ అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గిరిజన విద్యార్థులకు రెండు రోజుల్లో నోట్‌బుక్స్ పంపిణీ చేస్తాం. రావడం ఆలస్యమైంది. తక్షణమే తెప్పించి విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ అందేలా చూస్తాం. విద్యార్థులు హోం వర్క్, క్లాస్ వర్క్‌కు ఇబ్బంది రాకుండా చూస్తాం.
– ఫిరంగి, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్
విద్యాసంవత్సరం ప్రారంభమై
నెలకావస్తున్నా పంపిణీలో జాప్యం
పాత కాపీల్లోనే నోట్స్ రాసుకుంటున్న విద్యార్థులు
చోద్యం చూస్తున్న గిరిజన
సంక్షేమశాఖ అధికారులు


