భక్తుల కోలాహలం | - | Sakshi
Sakshi News home page

భక్తుల కోలాహలం

Jul 20 2026 12:56 AM | Updated on Jul 20 2026 12:56 AM

బొగతలో పర్యాటకులు

ప్రత్యేక అలంకరణలో స్వామి వారు, హారతి తీసుకుంటున్న భక్తులు

జలపాతం వద్ద పర్యాటకులు

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు.

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. శనివారం రాత్రి మండలంలో ఒక మోస్తరు వర్షం కురువడంతో బొగత జలపాతానికి జలదారలు కొంచెం పెరిగాయి. దీంతో పర్యాటకుల అక్కడికి చేరుకుని సందడి చేశారు. సెల్ఫీలు, ఫొటోలు దిగారు. సమీపంలోని నీటి కొలనులో దిగి జలకాలాడుతూ ఆనందంగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement