సీపీని కలిసిన ములుగు డీఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సీపీని కలిసిన ములుగు డీఎస్పీ

Jul 9 2026 6:53 AM | Updated on Jul 9 2026 6:53 AM

వరంగల్‌ క్రైం : ఇటీవల వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్‌.శ్వేతను ములుగు డీఎస్పీ రవీందర్‌ బుధవారం వరంగల్‌ కమిషనర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాఖపరమైన అంశాలపై ముచ్చటించుకున్నారు.

వసతిగృహాల్లో డీపీఓ తనిఖీ

మంగపేట: మండల పరిధిలోని మంగపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తిమ్మంపేటలోని ఎస్టీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషలాఫీసర్‌ కొండ వెంకయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలోని పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. సరుకుల స్టాక్‌ వివరాలు తెలుసుకుని పరిశీలించారు. కస్తూర్బా విద్యార్థినులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్టీ వసతి గృహం వార్డెన్‌ నర్సయ్య, కేజీబీవీ స్పెషలాఫీసర్‌ భాగ్యలక్ష్మిని ఆదేశించారు. హాస్టళ్లలో పరిసరాల పరిశుభ్రత, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ భద్రునాయక్‌, టీఎస్‌ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య ఉన్నారు.

‘ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి’

ములుగు రూరల్‌: మల్లంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకో వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవితేజ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం గురుకుల పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ గురుకుల పాఠశాల విద్యార్థులతో గ్యాస్‌ సిలిండర్లు మోయించడం సరికాదన్నారు. విద్యార్థులతో పని చేయించడం తప్పని తెలిపారు. అందుకు బాధ్యులైన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

అమ్మ పేరుతో మొక్క నాటాలి

ములుగు: పర్యావరణ పరిరక్షణకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఓ మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థి తమ తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్క నాటి ప్రకృతికి సేవ చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో శ్రీసోయింగ్‌ టు గ్రోయింగ్‌శ్రీ థీమ్‌తో మొక్కల నాటడం ప్రారంభమవుతుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులకు సెప్టెంబర్‌ 20న రాష్ట్ర స్థాయి సమీక్ష, అక్టోబర్‌లో జాతీయ స్థాయి పర్యావరణ పోటీలు ఉంటాయని డీఈఓ పేర్కొన్నారు.

శిక్షణను సద్వినియోగం

చేసుకోవాలి

ములుగు: గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. నేడు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెనన్‌లో గురువారం ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క హాజరవుతారని వెల్లడించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement