అధికార పక్షానికే | - | Sakshi
Sakshi News home page

అధికార పక్షానికే

Jul 16 2026 5:30 AM | Updated on Jul 16 2026 5:30 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026
మెరుగైన వైద్యసేవలు అందించాలి

ములుగు: సహకార పదవుల భర్తీ విషయంలో ఉత్కంఠకు తెరపడింది. నామినేటెడ్‌ పద్ధతిలోనా.. లేక ఎన్నికలా... అనే అంశంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్‌ పద్ధతిలోనే సహకార పదవుల భర్తీ జరుగుతుందని ప్రభుత్వం తేల్చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటు నామినేటెడ్‌ విధానంలో ఎంపిక కావడంతో ఈనెలాఖరులోగా మిగిలిన జిల్లాల్లో పీఏసీఎస్‌ పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహుల జాబితా అదిష్టానానికి చేరగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ల ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. నామినేటెడ్‌ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని 12 పీఏసీఎస్‌లకు 12 మంది చైర్మన్లు, 12 మంది వైస్‌ చైర్మన్లతో పాటు 132 మంది డైరెక్టర్లు నామినేటెడ్‌ పద్ధతిలో ఎంపిక కానున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

తొలిసారిగా నామినేటెడ్‌ పద్ధతిలో..

సహకార వ్యవస్థలో పీఏసీఎస్‌ పదవులు తొలిసారిగా నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ కానున్నాయి. పీఏసీఎస్‌లకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 16న చైర్మన్లను ఎన్నుకోగా 2025 ఫిబ్రవరి 16తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పదవీ కాలాన్ని పొడగించింది. పొడగించిన పదవీకాలం ఆగస్టు 15తో ముగియనుంది. మరో ఆరు నెలల పాటు పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పాలకవర్గాల పనితీరు బాగున్న సంఘాలను మాత్రమే పొడగించాలని, సొసైటీ అభివృద్ధికి పాటుపడాలని పాలకవర్గాలను రద్దు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో జిల్లాలోని 12 పాలకవర్గాల్లో 3 సొసైటీలు రద్దయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా నామినేటెడ్‌ పద్ధతిలో పాలకవర్గాలను నియమిస్తుండడంతో కాంగ్రెస్‌ నేతల్లో సంబురాలు నెలకొన్నాయి.

వెంకటాపురం(ఎం) పీఏసీఎస్‌ కార్యాలయం

కాంగ్రెస్‌ నేతల్లో జోష్‌..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా పదవులు లేవని కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. జిల్లాలో పీఏసీఎస్‌లకు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకవర్గాలను ప్రభుత్వం నియమిస్తుందనే సమాచారంతో ఆశావహుల్లో ఒక్కసారిగా ఆశలు రెకేత్తాయి. సహకార పదవులను నామినేటెడ్‌ పద్ధతిలో కాంగ్రెస్‌ నేతలకు ఇవ్వడం మూలంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను తొలగించవచ్చని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది. పీఏసీఎస్‌ కమిటీ పదవులను ఆశిస్తున్న వారి జాబితా ఇప్పటికే అధిష్టానానికి చేరినట్లు సమాచారం. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే పీఏసీ ఎస్‌ పాలకవర్గాలను మంత్రి సీతక్క ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గతంలో జరిగిన జీపీ ఎన్నికలు, రాబోయే పరిషత్‌ ఎ న్నికలను దృష్టిలో పెట్టుకొని పీఏసీఎస్‌ పాలకవర్గాల కమిటీలను ప్రకటించనున్నట్లు సమాచారం.

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

సహకార సంఘాలకు పాలకవర్గాలు

నామినేటెడ్‌ పద్ధతిలో నియామకాలు

నెలాఖరులోగా పాలకవర్గాలను

ప్రకటించే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement