● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షు డు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు ఆది వారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు పాటుపడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాలలో ప్రజాసమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణాకర్, దొంతిరెడ్డి రవిరెడ్డి, హేమాద్రి, రాజ్‌కుమార్, పవన్ కల్యాణ్, శ్రీహరి, రఘువీర్, లక్ష్మి, ఓదెలు, అశోక్, రాజేందర్, సురేశ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.


