మూడెకరాల వరకు అందిన
పెట్టుబడి సాయం..
రైతులందరికీ పెట్టుబడి సాయం..
ములుగు: వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని ఆర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా మొదటి విడత పెట్టుబడి సాయం జమ కావడం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సాగుకు అనుకూలమైన భూమి ఉన్న 63,958 మంది రైతులకు గాను.. ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.49,82,63,773 రూపాయలను ప్రభుత్వం ఖాతాల్లో జమచేసింది. గత యాసంగి పంట సమయంలో ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఈసారి తొమ్మిది రోజుల్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు భరోసా డబ్బులను జమ చేసింది.
మొత్తం రైతులు 88,450 మంది..
అందాల్సిన సాయం రూ.106 కోట్లు
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ లో 1.70లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో రైతు భరోసా కింద 88,450 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.106,35,12,869లను రైతులకు ప్రభుత్వం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 63,958 మంది రైతుల ఖాతాల్లో రూ. 49,82,63,773 ప్రభుత్వం జమ చేసింది.
మూడు ఎకరాల వరకు అందిన సాయం
మొదటి విడతలో 2 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ గురువారం వరకు మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు జమ ఆయ్యాయి. మరో నాలుగు రోజుల్లో మిగిలిన రైతులకు సైతం రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా పట్టా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందనుంది.
జిల్లాలో 63,958 మంది రైతుల ఖాతాల్లో రూ.49.82 కోట్లు జమ
కొత్తగా పట్టాపాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం సాయం
మండలం రైతులు పెట్టుబడి సాయం
(రూ.కోట్లలో)
ములుగు 10,010 రూ.7,28,76,385
వెంకటాపురం(ఎం) 9,036 రూ.6,82,93,098
మంగపేట 6,988 రూ.6,40,43,983
వాజేడు 7,004 రూ.5,04,68,209
వెంకటాపురం(కె) 6,432 రూ.4,84,71,086 గోవిందరావుపేట 5,224 రూ.4,51,52,203
ఎస్‌ఎస్‌తాడ్వాయి 5,258 రూ.4,47,40,475
ఏటూరునాగారం 5,494 రూ.4,19,42,109
మల్లంపల్లి 4,670 రూ.3,47,02,763
కన్నాయిగూడెం 3,842 రూ.2,75,73,462
రైతులకు అందిన పెట్టుబడి సాయం
వానకాలం సీజన్ కు సంబంధించి ప్రతీ రైతుకు రైతు భరోసా డబ్బులు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ అయింది మరో నాలుగు రోజుల్లో మిగిలిన రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
– సురేశ్ కుమార్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి


