క్రీడలతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఆరోగ్యం

Jul 19 2026 1:32 AM | Updated on Jul 19 2026 1:32 AM

బెటాలియన్‌ కమాండెంట్‌ సుబ్రహ్మణ్యం

గోవిందరావుపేట: క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతుందని చల్వాయి 5వ బెటాలియన్‌ కమాండెంట్‌ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ మేరకు బెటాలియన్‌ ప్రాంగణంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన క్రీడాపోటీలకు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌, ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీల్లో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ సీతారాం, సహాయక కమాండెంట్లు కృష్ణప్రసాద్‌, ధర్మారావు, ఆర్‌ఐలు భాస్కర్‌, కిరణ్‌ కుమార్‌, శ్రీనివాసచారి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్‌, స్వామితో పాటు అధికారులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement