నాటిన మొక్కలను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

నాటిన మొక్కలను సంరక్షించాలి

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

డీపీఓ వెంకయ్య

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించాలని డీపీఓ కొండా వెంకయ్య సూచించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేడారంలో రోడ్ల వెంట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను మంగళవారం ఆయన పరిశీలించారు. మొక్కల చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, పశువులు, ఇతర కారణాలతో మొక్కలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, వాటి ఎదుగుదలకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మేడారం మహాజాతర సందర్భంగా రోడ్ల విస్తర్ణణ పనులు చేపట్టడంతో పాటు కలెక్టర్‌ అదేశాల మేరకు మొక్కలు నాటుతున్నట్లు తెలి పారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement