వాజేడు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించి మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని కాచారం పాఠశాలతో పాటు పెద్దగొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. పాఠాలు చదివించి.. రాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చదువులో వెనుక బడిన వారిని గుర్తించి అందరితో సమానంగా చదివేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. విద్యార్థులు చదుపుపై శ్రద్ధ చూపేలా బోధించాలన్నారు. పెద్ద గొళ్లగూడెం ఆశ్రమ పాఠశాల విస్తీర్ణం, గదులు విశాలంగా ఉన్నప్పటికీ విద్యార్ధుల సంఖ్య తగ్గడంపై సిబ్బందిని ప్రశ్నించారు. 130 మంది విద్యార్థినులే ఉండడంతో సంఖ్య పెరిగేలా చూడాలని ఆదేశించారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, మరుగు దొడ్లు సక్రమంగా లేవని, వర్కర్ల వేతనాలు రాకపోవడంతో పాటు ఇతర సమస్యలను పీఓ దృష్టికి సిబ్బంది తీసుకెళ్లగా వివరాలు తనకు పంపించాలని సిబ్బందికి పీఓ సూచించారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


