కన్నాయిగూడెం: మండల పరిధిలోని ముప్పనపల్లి గ్రామస్తులు ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం మొక్కులు సమర్పించి యాటలు బలిచ్చారు.
కొండచిలువ కలకలం
ఏటూరునాగారం: మండల పరిధిలోని శంకరాజుపల్లిలో పాత రైస్‌మిల్లులో ఉన్న కొండచిలువ ఆదివారం కలకలం లేపింది. ఈ మేరకు రైస్‌మిల్లు యజమానికి లింగాల ఓంకార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు సెక్షన్ ఆఫీసర్ తార, బీట్ ఆఫీసర్ దయానంద్ తెలిపారు. వారి వెంట సిబ్బంది హరీశ్, సాంబయ్య, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
అంతరాలు లేని
సమాజమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: అంతరాలు లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సీహెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతు కమ్యూనిస్టులదేనని అన్నారు. కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం నిరంతరం పోరా డేది కమ్యూనిస్టులని చెప్పారు. సమాజంలోని అసమానతలు, అంతరాలను రూపుమాపేందుకు ప్రతి కార్యకర్త వర్గ దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. భాగం హేమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించి పార్టీ నిర్మాణాన్ని బలో పేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పైండ్ల శాంతికుమార్, సుధాకర్ రెడ్డి, పరమాండ్ల రాజయ్య, అన్నారపు రాజేందర్, సొతుకు ప్రవీణ్‌కుమార్, కొరిమి సుగుణ, క్యాతరాజ్ సతీష్, కుడుదుల వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మామిడాల సమ్మిరెడ్డి, పెంట రవి, రేగొండ రాజయ్య, కుమారస్వామి, నబీ, గుంటి చంద్రమౌళి, మాతంగి రామచందర్, జి. శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గోలి లావణ్య, యాకుబ్ పాషాలు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ఆటో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా కన్వీనర్ నాగుల అరవీంద్ డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో ఆటో అన్నలతో ముఖాముఖ్ఙి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల అరవింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.


