ములుగు రూరల్: దోస్త్ ద్వారా ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పెషల్ ఫేస్ ద్వారా డిగ్రీలో చేరే విద్యార్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కోర్సుకు సంబంధించిన సందేహాలు ఉంటే జిల్లాలోని డిగ్రీ కళాశాలలో లేదా దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.


