ములుగు రూరల్: తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్‌లో ఇంటర్నేషనల్ ప్రెస్ విభాగంలో అవార్డు సాధించిన బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థిని హర్షితను డీఈఓ సిద్ధార్థ రెడ్డి అభినందించారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్షిత ప్రతిభను గుర్తించి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించారని తెలిపారు. ఈ మేరకు పాఠశాల సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు సదానందం, మహ్మద్ ఆయాజ్ ఖాన్‌లను సైతం డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


