అడుగడుగునా వేధింపులు!
అప్రమత్తతే ఆయుధం..
● జడ్జి ఎస్‌వీపీ.సూర్య చంద్రకళ
ములుగు: అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నారని, ఎక్కడైతే సీ్త్రలు గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలందుకుంటారని జిల్లా జడ్జి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మహిళ కోర్టు సిబ్బందికి ఆటలు, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.మధులిక, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
పెరిగిన ఈవ్‌టీజింగ్ కేసులు..
ఏటా 3.6 శాతం కేసులు పెరుగుదల
రెండు నెలలు..80 వేధింపుల కేసులు
పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా
ఉండాలి
సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత


