
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్లపల్లిలో ఉన్న పవన్ నెక్సా మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేశారంటూ ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడి షోరూమ్‌గా గుర్తించారు. బంద్ చేయకుండా షోరూం తెరవడంతో బీజేపీ, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో రాళ్లతో దాడి చేశారు.

