సిగరెట్‌ ఫ్యాక్టరీపై మిసైల్‌ దాడి.. 15 మంది మృతి | 15 killed in strike on factory in Iran | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ ఫ్యాక్టరీపై మిసైల్‌ దాడి.. 15 మంది మృతి

Mar 15 2026 7:30 AM | Updated on Mar 15 2026 12:26 PM

 15 killed in strike on factory in Iran

టెహ్రాన్‌: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్‌ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్‌ ప్రకటించింది.

ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ‍ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ‍ప్రజలే. అయితే ఈ యుద్దం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్‌లోని  ఇస్ఫాహాన్‌ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో 15 మందికి పైగా మృతిచెందారు.

ఇస్ఫాహాన్‌ నగరంలో  రిఫ్రిజిరేటర్లు, హీటర్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీపై ఈ దాడులు జరిగినట్లు  ఆ దేశ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అందులో కార్మికులు విధులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని తెలిపాయి. అయితే ఇటీవల ఖర్గే ద్వీపంపై అమెరికా దాడి చేసిన తర్వాతే ఈ క్షిపణి అటాక్ జరిగింది. అయితే దీనికి ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది.

అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేశామని ప్రకటించారు. ఇరాన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.అయితే ట్రంప్ ఇటీవలే హార్మూజ్‌ జలసంధిలో చమురు రవాణాకు రక్షణ కల్పించే విధంగా వివిధ దేశాలు తమ యుద్ధ నౌకలు అక్కడికి పంపించాలని కోరారు. 

అయితే ఇరాన్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. తమ అనుమతి లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణిస్తే వాణిజ్య నౌకలు పేల్చివేస్తామని హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement