పెట్ యానిమల్స్‌ని పెంచుకోవడమే కాదు.వాటిని సరియైన పద్ధతిల్లో నియంత్రించడం కూడా తెలిసి ఉండాలి యజమానులకు. మరీ ముఖ్యంగా పిట్ బుల్ లాంటి పెంపుడు కుక్కల్ని పెంచుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చిన్న పిల్లలు, వృద్ధులు ప్రమాదంలో పడతారు. ఫలితంగా యజమానులకు కూడా చట్టపరమైన తిప్పలు తప్పవు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారు.
న్యూయార్క్ వీధుల్లో ఒక పిట్ బుల్ ఒక పసిపిల్లవాడిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క క్షణం ఆ పసివాడి తల్లి గుండ్లో రైళ్లు పరుగెట్టిందింది. కానీ అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న వారు స్పందించడంతో ఆ పసివాడికి ప్రాణా పాయం తప్పింది.
A pit bull attacked a toddler on the streets of New York, but luckily a bystander was quick enough to choke the dog before it could do further harm the child.😳 pic.twitter.com/Yh6btEwVVm
— Rain Drops Media (@Raindropsmedia1) December 23, 2025
ట్విటర్‌లో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో ప్రకారం పిట్ బుల్ డాగ్ పిల్లవాడి కాలును గట్టిగా దొరకబుచ్చుకుంది. నలుగురు వ్యక్తులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కూడా, ఎంతకీ వదలకుండా పట్టుపట్టింది. దీంతో వారిలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ కుక్కను గొంతు పట్టుకుని గాలి ఆడకుండా చేయడంతో అది నోటి తెరిచి పట్టువీడింది. దీంతో మరింత గాయం కాకుండా పిల్లవాడి కాలును తప్పించుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కుక్క కరచినపుడు ఎలా ప్రవర్తించాలో, కచ్చితంగా అదే చేశాడు. హీరో అంటూ అతని చర్యను కొనియాడటం విశేషం.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


