సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కారుకు నిప్పు అంటించిన తర్వాత సదరు వ్యక్తి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే పలుమార్లు పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన అనంతరం తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటికైనా పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


