చైనా దేశం మరో భారీ నిర్మాణానికి సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కృత్తిమ ద్వీపం నిర్మాణాన్ని డ్రాగన్ కంట్రీ చేపడుతుంది. ఈ ద్వీపాన్నిఅణు బాంబు దాడులను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కొత్త కొత్త నిర్మాణాలతో ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచే డ్రాగన్ కంట్రీ మరో భారీ నిర్మాణం చేపడుతుంది. అణుబాంబు దాడులను సైతం తట్టుకునేలా భారీ కృత్తిమ ద్వీపనిర్మాణం నిర్మిస్తున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఐస్ లాండ్ ఆరు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తైన అలలను తట్టుకోవడంతో పాటు కఠినమైన తుఫానులను సైతం ఎదుర్కొనేలా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏర్పరిచిన సామాగ్రి 238 మందికి నాలుగు నెలల పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ద్వీపంలో అన్ని రకాల ఎమర్జెన్సీ కంపర్ట్ మెంట్ లు నిర్మిస్తున్నామని, వాటిలో ఎమర్జెన్సీ పవర్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు.
ఈ ద్వీపం 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పుతో నీటి మట్టానికి 45 మీటర్ల ఎత్తు ఉండేలా దీని నిర్మాణం చేపడుతున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని బరువు 78 వేల టన్నులుని తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా దీని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీగా ఫిలవబడే ఈ ద్వీప నిర్మాణం 2028 వరకూ పూర్తి చేయనున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఇటీవలే చైనాలో నిర్మించిన ఓ భారీ వంతెన ప్రారంభించిన కొద్ది రోజులకే కూలిపోయింది. దీంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టారని ఆ దేశ ఇంజినీర్లపై విమర్శలు వ్యక్తమయ్యాయి.


