వెనిజువెలాపై అమెరికా దాడిపై ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ట్రంప్ మాదిరిగా భారత ప్రధాని మోదీ సైతం పాకిస్థాన్‌పై దాడి చేయాలన్నారు. అలా దాడి చేసి 26/11 ఘటన బాధ్యుల్ని భారత్ తీసుకురావాలని సూచించారు. అమెరికా ఆపని చేయగా లేనిదీ.. భారత్ ఎందుకు చేయలేదని అన్నారు.
26/11 ఉగ్రవాద దాడి ఘటన దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ముష్కరుల కిరాతకంగా అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మసూద్ అజర్ పాకిస్థాన్‌లో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.
భారత ప్రధాని మోదీకి, అసదుద్దీన్ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. "మోదీజీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పాకిస్థాన్‌కు ప్రత్యేక బలగాలను పంపండి.26/11 ఉగ్రదాడి సూత్రధారులను వెనక్కి తీసుకరండి. ట్రంప్ అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయాలేరు. ట్రంప్ కంటే మీరు ఎందులో తక్కువ కాదు". అని అసదుద్దీన్ అన్నారు.
అయితే గతంలోనూ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహంపై అసదుద్దీన్ వ్యంగ్యంగా స్పందించారు. ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. శుక్రవారం వెనిజువెలాపై, అమెరికా ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది. ఆదేశ అధ్యక్షుడితో పాటు అతని భార్యను బందీగా అమెరికా తరలించిన సంగతి తెలిసిందే.


