kolkata: మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యం | 4 Year Old Sleeping Next To Grandmother Kidnapped Kolkata | Sakshi
Sakshi News home page

kolkata: మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యం

Nov 9 2025 11:22 AM | Updated on Nov 9 2025 12:18 PM

4 Year Old Sleeping Next To Grandmother Kidnapped Kolkata

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో మరో దారుణం చోటుచేసుకుంది. రాత్రి  అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక అపహరణకు గురైంది. ఆ తరువాత ఆ చిన్నారి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నదని పోలీసులు తెలిపారు. స్థానిక బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ తన మనుమరాలితో పాటు తారకేశ్వర్‌లోని రైల్వే షెడ్‌లో దోమతెర అమర్చిన మంచం మీద నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని హుగ్లీ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
 

చిన్నారిపై దాడికి పాల్పడిన వ్యక్తి  మంచానికి అమర్చిన దోమతెరను చింపివేసి, బాలికను  ఎత్తుకుపోయాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మర్నాటి మధ్యాహ్నం  ఆ చిన్నారి  తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో కనిపించింది. ‘పాప నా పక్కన నిద్రపోతోంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పాపను ఎవరో లాక్కుపోయారు. పాపను తీసుకెళ్లిన ఖచ్చితమైన సమయం కూడా నాకు తెలియదు.  ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు. అయితే వారు దోమతెరను చింపేసి, పాపను తీసుకుపోయారు’అంటూ ఆ బాలిక అమ్మమ్మ చినిగిపోయిన దోమ తెరను చూపిస్తూ  మీడియాకు చెప్పింది. తమ ఇళ్లను కూల్చివేయడంతో వీధుల్లో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తాము ఎక్కడికి వెళ్లాలని బాధితురాలు కన్నీళ్లతో చెప్పింది. కాగా ఈ కేసులో పోలీసులు ఆ బాలిక తాత రాజు దాస్ (45)ను అరెస్టు చేశారు.

ప్రస్తుతం బాధిత చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పాక్పో)కింద ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  ఉదంతం గురించి తెలియగానే బీజేపీ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగింది. ‘తారకేశ్వర్‌లో నాలుగేళ్ల ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారు  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. తారకేశ్వర్ పోలీసులు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇది మమతా బెనర్జీ స్వేచ్ఛాయుత పాలనకు గుర్తు.  ఒక చిన్నారి జీవితం ఛిన్నాభిన్నమైంది. అయినప్పటికీ పోలీసులు నిజాన్ని అణిచివేయడం ద్వారా రాష్ట్రంలోని నకిలీ శాంతిభద్రతల ఇమేజ్‌ను కాపాడుతున్నారు’ అంటూ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement