తాలిబాన్‌లపై విరుచుకుపడిన పాక్‌.. 400 మంది మృతి | Over 250 Killed, 400 Injured In KABUL | Sakshi
Sakshi News home page

తాలిబాన్‌లపై విరుచుకుపడిన పాక్‌.. 400 మంది మృతి

Mar 17 2026 4:05 AM | Updated on Mar 17 2026 10:46 AM

Over 250 Killed, 400 Injured In KABUL

కాబూల్‌: ఆప్ఘనిస్థాన్‌లో పాకిస్తాన్‌ దళాలు విరుచుకుపడ్డాయి. కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్తాన్‌ ఎయిర్‌ స్ట్రైక్ చేసింది. పాక్‌ దాడుల్లో దాదాపు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డట్లు అఫ్గానిస్థాన్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ దాడిపై అఫ్గాన్ తాలిబన్లు స్పందించారు" పాకిస్తాన్‌ మరోసారి అఫ్గాన్ గగనతల నియమాలను ఉల్లంఘించింది. కాబూల్‌లోని మాదకద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది, మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్న వారు ఈ దాడుల్లో మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు". అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు.

కాగా గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌.. కాబూల్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేయగా అఫ్గాన్‌ సైతం ప్రతిదాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement