థాయిలాండ్‌లో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఓ భారత పర్యాటకున్ని అక్కడి ట్రాన్స్‌జెండర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
థాయిలాండ్‌లోని పట్టాయాలో 52 ఏళ్ల రాజ్ జసూజా అనే భారత పర్యాటకుడిపై అక్కడి ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా దాడిచేశారు. డిసెంబర్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్ జసూజా అక్కడి ట్రాన్స్ జెండర్ల సర్వీసుకు వారు అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు.
దీంతో ఆగ్రహం చెందిన సెక్స్ వర్కర్స్ కారు లోంచి అతనిని లాగి పడేశారు. అనంతరం అతని తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దాడిని గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి అక్కడి భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.
అయితే థాయిలాండ్‌లోని పట్టాయాలో ఇటువంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఇండియన్ టూరిస్ట్‌పై అక్కడి సెక్స్ వర్కర్ దాడి చేశాడు. అక్టోబర్‌లో ముగ్గురు ట్రాన్స్ మహిళలు హోటల్‌లో ఉన్న ఇద్దరు భారతీయులపై దాడి చేసి వారి వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లారు.


