ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు! | Donald Trump Says He Will Hike Tariffs on EU Cars to 25 Percent | Sakshi
Sakshi News home page

ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

May 2 2026 4:43 PM | Updated on May 2 2026 6:54 PM

Donald Trump Says He Will Hike Tariffs on EU Cars to 25 Percent

యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించకపోవడం వల్ల తాను ఈ సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ తెలిపారు.

"మనం పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ పాటించలేదు. కాబట్టి వచ్చే వారం అమెరికాలోకి వచ్చే కార్లు, ట్రక్కులపై యూరోపియన్ యూనియన్‌కు విధించే సుంకాలను పెంచుతాను," అని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల ఆదాయం యునైటెడ్ స్టేట్స్‌లోకి వస్తుంది. అంతే కాకుండా ఇది ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు.

ఆగస్టులో అమెరికా, యూరోపియన్ యూనియన్ ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి, దీని ప్రకారం యూరోపియన్ యూనియన్‌పై సుంకాలను 15 శాతానికి తగ్గించారు. ఆ సమయంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పారిశ్రామిక వస్తువులు, వాహనాలపై సుంకాలను తొలగించడానికి యూరోపియన్ యూనియన్ కూడా అంగీకరించింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement