ఫైలట్‌ పంపిన సందేశంతో.. ఆశ్చర్యపోయిన ట్రంప్ | Donald Trump Reveals American Pilot First Message After Dramatic Rescue In Iran Mountains, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫైలట్‌ పంపిన సందేశంతో.. ఆశ్చర్యపోయిన ట్రంప్

Apr 6 2026 12:50 AM | Updated on Apr 6 2026 3:59 PM

 donald trump iran war  3 word message that airman

ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న  అమెరికా ఫైలట్‌ను ఆ దేశ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్‌ భూభాగంలో చిక్కుకున్న తర్వాత ఆయన పంపిన తొలి సందేశం అమెరికా అధికారులను ఆశ్చర్యానికి గురి చేసిందని డొనాల్డ్ ట్రంప్ మీడియాతో తెలిపారు.  

ఈ అంశమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. "ఆ అధికారి పంపిన సందేశం వినడానికి ఒక ముస్లిం వ్యక్తి చెప్పినట్లుగా ఉంది. అందుకే మొదట అది ఇరాన్ పన్నిన కుట్ర ఏమో అని అనుమానించాను. కానీ తర్వాత ఆ అధికారి చాలా దైవచింతన గల వ్యక్తి అని తెలియడంతో ఆ సందేశం నిజమేనని నిర్ధారించుకున్నాను" అని అన్నారు.

ఆ  సందేశం ఏంటంటే? 
ఇరాన్ పర్వతాల్లో చిక్కుకున్న ఆ అధికారి తన వద్ద ఉన్న రేడియో ద్వారా పంపిన మొదటి సందేశం 'Power be to God,'" మహిమంతా దేవుడిదే అనే సందేశం తన వద్ద ఉన్న ఒక హ్యాండ్‌గన్ ద్వారా పంపారు. అనంతరం  ట్రాకింగ్ బీకాన్ మరియు కమ్యూనికేషన్ పరికరంతో ఇరాన్ దళాలకు దొరక్కుండా పర్వతాల్లో దాక్కున్నారు. ఒక దశలో శత్రువుల నుండి తప్పించుకోవడానికి 7,000 అడుగుల ఎత్తున్న పర్వత శ్రేణిని కూడా ఆయన ఎక్కినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఆపరేషన్ ప్రపంచ రక్షణ వ్యవస్థలో అమెరికాకున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.అమెరికా నిఘా సంస్థ CIA, తనకున్న ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన దాక్కున్న ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించింది. దాదాపు 48 గంటల పాటు ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శనివారం రాత్రి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగి, శత్రువుల మధ్య ఉన్న ఆ అధికారిని సురక్షితంగా రక్షించి వెనక్కి తీసుకువచ్చారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement