
పాక్ ఉన్న తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం చేసింది. వెంటనే లాహోర్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్ ఎంబసీ సూచనలు జారీ చేసింది. లాహోర్‌లో విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.
కాగా, మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పీవోకేలో ఉగ్ర వాదులను వేటాడుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులు చేస్తోంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసమైనట్లు తెలుస్తోందని భారత్ ఇప్పటికే వెల్లడించింది. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి.
యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది.