
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు శనివారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంచిర్యాలకు రెడ్డి కాలనీకి చెందిన విఘ్నేష్-రమాదేవి దంపతుల కూమార్తెలు స్రవంతి, తేజస్విలు.. వీరికి వివాహాలు జరగ్గా.. భర్త, పిల్లలతో అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరూ కూతుళ్ల వద్దకు వెళ్లారు.
విఘ్నేష్ చిన్న కూతురు తేజస్వి రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేశారు. స్రవంతి కూతురు పుట్టిన రోజు ఉండటంతో శనివారం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, ఆమె భర్త కిరణ్ కుమార్, ఇద్దరూ పిల్లలు కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. చికాగో సమీపంలో వీరి కారును ట్రక్కు ఢీ కొనడంతో రమాదేవి(52), తేజస్వి (32) మరణించారు. కారులో ఉన్న విఘ్నేష్, అల్లుడు కిరణ్ కుమార్, పిల్లలు గాయపడ్డారు.