ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టితో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు 9 ఏళ్ల బాలుడు ఉండటం మరింత హృదయ విదారకంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


