అమెరికా ఎఫెక్ట్‌?.. ఇరాన్‌ చమురు నౌకలు సీజ్? | Indian Navy seizes Iranian oil tankers | Sakshi
Sakshi News home page

అమెరికా ఎఫెక్ట్‌?.. ఇరాన్‌ చమురు నౌకలు సీజ్?

Feb 17 2026 9:25 AM | Updated on Feb 22 2026 2:34 PM

Indian Navy seizes Iranian oil tankers

ఇటీవల ఇండియన్ నేవీ అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసింది.  అయితే తాజాగా వాటికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఆ నౌకలు ఇరాన్‌కు చెందినవని తెలుస్తోంది. అమెరికా వీటిని గతంలోనే నిషేదించిందని తెలుస్తోంది.

ఫిబ్రవరి 6న ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ అధికారులు ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ నౌకల పేర్లు స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్జియాగా తెలిపారు. అనంతరం కొద్దిసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే తాజాగా ఆ నిషేదిత నౌకలకు ఇరాన్‌కు సంబంధించినవిగా మీడియా కథనాలు ప్రచురితమవుతున్నాయి.

వాషింగ్టన్ డీసీకి చెందిన పరిశోధనా సంస్థ ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) ప్రకారం, “ ఈ మూడు ఇరాన్‌ నౌకలను అమెరికా గతంలో నిషేధించింది.  ఈ నౌకలు యూఏఈకి చెందిన భారతీయ పౌరుడు జుగ్వీందర్ సింగ్ బ్రార్ 30-ట్యాంకర్ల నౌకాదళానికి చెందినవి. వీటిని సీజ్‌ చేసిన సమయంలో స్టెల్లార్ రూబీ నౌకపై  ఇరాన్ జెండా ఎగురుతుంది“ ఎఫ్‌డీడీ పేర్కొంది. 

అల్ జాఫ్జియా  నౌక 2025లో ఇరాన్ నుండి జిబౌటికి ఇంధన చమురును రవాణా చేసింది. ఆస్ఫాల్ట్ స్టార్ ఎక్కువగా చైనా చుట్టూ ప్రయాణాలపై నడిచిందని డేటాలో పేర్కొంది.అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. నేషనల్ ఆయిల్ కంపెనీ చర్యలను ఊటంకిస్తూ సీజ్ అయిన నౌకలకు ఆ కంపెనీతో సంబంధం లేదని తెలిపింది. అయితే గతంలో ఈ నౌకలు స్వాధీనం చేసుకున్న తర్వాత భారత నేవికా దళం భద్రతను మరింతగా పెంచింది.

అయితే ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఇటీవల భారత్‌పై విధించిన అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానితో ఫోన్‌లోనూ చర్చించారు. దీనికి మోదీ సైతం ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement