పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్‌ | Indian Woman Missing In Us Days After Arriving For Arranged Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్‌

Jun 29 2025 5:53 PM | Updated on Jun 29 2025 6:12 PM

Indian Woman Missing In Us Days After Arriving For Arranged Marriage

పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.

జూన్‌ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు..  ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్‌ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్‌ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.

సిమ్రాన్‌ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement