
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్‌క్లబ్‌లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.
ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్‌క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్‌వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.
Yet another mass shooting in Chicago media won't tell you about.
Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.
But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025