ఇరాన్‌పై అమెరికా కంబాట్‌ ఆపరేషన్?.. 50 వేలకు పైగా బలగాలు | Thousands Of Marines Add To Largest US Buildup In Middle East | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా కంబాట్‌ ఆపరేషన్?.. 50 వేలకు పైగా బలగాలు

Mar 29 2026 2:00 AM | Updated on Mar 29 2026 3:05 AM

 Thousands Of Marines Add To Largest US Buildup In Middle East

పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపుగా నెలరోజులు గడుస్తోంది. అయినప్పటికీ ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా యుఎస్‌ భారీగా సైనికులను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. తాజాగా అమెరికా భారీగా తమ సైనిక బలగాలను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో మరింతగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏం జరగనుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఓ వైపేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మాటెత్తుతూనే.. భారీ సంఖ్యలో సైన్యాన్ని మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తున్నారు. ఇదివరకే దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు అక్కడ ఉండగా ఇప్పుడు దానికి తోడుగా దాదాపు 3,500 మంది బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఇంత పెద్ద మెుత్తంలో  మధ్యప్రాచ్యంలో బలగాలు మోహరించడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని పత్రికా కథనాలు పేర్కొన్నాయి

జపాన్ తీరంలోని తైవాన్ సమీపంలో విన్యాసాలు చేస్తున్న అమెరికా  ట్రిపోలీ నౌకను  అత్యవసరంగా మధ్యప్రాచ్యానికి తరలించారు. దీనితో పాటు శాన్ డియాగో నుండి USS బాక్సర్ మరియు ఇతర యుద్ధ నౌకలు కూడా మధ్యప్రాచ్యానికి బయిలుదేరాయి.  ఈ యుద్ధ నౌకలలో మెరైన్ సైనికులతో పాటు రవాణా విమానాలు, స్ట్రైక్ ఫైటర్ జెట్లు ఇతరాత్రా యుద్ధ సామాగ్రి ఉన్నాయి. ఈ   అదనపు సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు లేదా చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీప సమీపంలో సమీపంలో మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ అమెరికా సేనల రాకపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.  ఈ మేరకు ఇరాన్ అధికారిక పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' తన ప్రధాన శీర్షికలో "నరకానికి స్వాగతం"  అని ప్రచురించింది. ఏ ఒక్క అమెరికా సైనికుడు ఇరాన్ భూభాగంపై అడుగు పెట్టినా, వారు కేవలం శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement