అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పేరు వింటే చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచాన్నే సంక్షోభంలో నెట్టిపడేసారని ప్రజలంతా ఆయనపై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రికార్డు స్థాయిలో 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు అక్కడి పత్రికా కథనాలు పేర్కొన్నాయి.
ట్రంప్ నిర్ణయాల పట్ల అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్దానికి నిరసన తెలపడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా 3,300 చోట్ల ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి.
అమెరికా వ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' అనే పేరుతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మీడియా కథనాల ప్రకారం ఈ ప్రదర్శనలు అమెరికా అంతటా 50 రాష్ట్రాల్లో 3,300 కి పైగా ప్రదేశాలలో జరుగగా రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. కాగా ఇదివరకే ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. గతేడాది అక్టోబర్‌లో జరిపిన నిరసన కంటే ఈ సారి దాదాపు 10 లక్షల మంది అధికంగా పాల్గొన్నారని 600కు పైగా అధికంగా ఈవెంట్లు నిర్వహించబడ్డాయని అక్కడి కథనాలు పేర్కొన్నాయి.
ట్రంప్‌కు వ్యతిరేకంగా మెుదటిసారి జూన్ 2025లో తరువాత అక్టోబర్ 2025 లో రెండవ నిరసన జరిగింది. ట్రంప్, వాన్స్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఫ్లకార్డులు ప్రదర్శన చేపట్టినట్లు నిరసనలు జరిపారని కథనాలు పేర్కొన్నాయి.


