ప్రస్తుతం పాకిస్తాన్- అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం పలుమార్లు ఆ దేశానికి మద్దతుగా మాట్లాడడం జరిగింది. దీంతో భారత్ యూఎస్‌తో కొంత డిస్టెన్స్ పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా రిపబ్లికన్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఇండియాతోనే స్నేహం బాగుంటుందని అక్కడి నుండే భారత్‌కు సంపద,శాంతి లభించాయన్నారు.
భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ రిపబ్లికన్ పార్టీ ఎంపీ మెక్ కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాకు పాకిస్థాన్‌తో కంటే భారత్‌తోనే రిలేషన్ బాగుంటుందన్నారు. అమెరికాకు పెట్టుబడులు వచ్చేవి భారత్ నుంచి తప్ప.. పాక్ నుంచి కాదని 'సెంటర్ ఫర్ స్ట్రాటజీస్అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భారతదేశంలో అత్యధిక ప్రజలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారని ప్రపంచంలోని మిడిల్ క్లాస్ మార్కెట్‌ని భారత్ డామినేట్ చేస్తుందని తెలిపారు. ఇండియాలోని ప్రతిభావంతులైన యువత అమెరికాకు వచ్చి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారని మెక్ కార్మిక్ అన్నారు. అయితే ఇటీవల భారత్‌లోని యుఎస్ రాయబారి సైతం భారత్‌కు అనుకూలంగా మాట్లాడారు.
అమెరికాకు భారత్ తర్వాతే మరే దేశమైనా అని అన్నారు.కాగా ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధిస్తోంది.దీంతో ఎగుమతులు మందగించి దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు.


