అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి | 2 Indian Students Died In US Car Crash | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

May 13 2025 8:14 AM | Updated on May 13 2025 8:38 AM

2 Indian Students Died In US Car Crash

సౌరవ్ ప్రభాకర్‌(ఫైల్‌ఫొటో)

వాషింగ్టన్: అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్‌ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్‌(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్‌ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌ చేసింది.

మే 10న లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement