హెచ్‌–1బీ వీసాలకు  రెండు లక్షల దరఖాస్తులు | Over two lakh applicants paid 1 lakh dollers for H-1B visas | Sakshi
Sakshi News home page

హెచ్‌–1బీ వీసాలకు  రెండు లక్షల దరఖాస్తులు

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 6:20 AM

Over two lakh applicants paid 1 lakh dollers for H-1B visas

డీహెచ్‌ఎస్‌ సెక్రెటరీ మార్క్‌వేన్‌ ములిన్‌ వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌–1బీ వీసా రుసుము లక్ష డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ డిమాండ్‌ పెరడమే తప్ప తగ్గడం లేదు. ఈ వీసాల కోసం 2026 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) సెక్రెటరీ మార్క్‌వేన్‌ ములిన్‌ తెలిపారు. 

మంగళవారం సెనేట్‌ నిధుల కేటాయింపుల ఉపసంఘానికి ఈ మేరకు సమాచారం అందించారు. సుమారు 2.86 లక్షల హెచ్‌–1బీ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 2 లక్షల మంది లక్ష డాలర్లు చెల్లించేశారని పేర్కొన్నారు. రుసుము త్వరగా చెల్లిస్తేనే వారి వీసా ప్రక్రియను వేగంగా పూర్తి చేయగలుగుతామని స్పష్టంచేశారు. లక్ష డాలర్లు చెల్లించే దరఖాస్తుదారుల పత్రాలు సుమారు 15 రోజుల్లోనే ప్రాసెస్‌ అవుతాయని, ఇతర దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు ఏడున్నర నెలల పడుతుందని మార్క్‌వేన్‌ ములిన్‌ వివరించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement