ఇరాన్‌కు అమెరికా స్పెషల్‌ ఫోర్స్.. రీజన్ ఇదే..? | US To Send 3,000 Troops From Elite Army Brigade | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు అమెరికా స్పెషల్‌ ఫోర్స్.. రీజన్ ఇదే..?

Mar 25 2026 4:38 AM | Updated on Mar 25 2026 12:45 PM

US To Send 3,000 Troops From Elite Army Brigade

మధ్యప్రాచ్యంలో యుద్దంపై అమెరికా ఓ వైపు  చర్చలు జరుపుతూనే మరోవైపు అదనపు బలగాలు అక్కడికి పంపిస్తున్నట్లు సమాచారం. తాజాగా అమెరికా మెరైన్ బలగాలకు సహాయంగా మిడిల్ ఈస్ట్‌కు అత్యంత శక్తివంతమైన  3,000 మంది ఎలైట్ సైనికులు పంపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి..

ఇంతకాలం బాంబులు మిసైళ్లతో దద్దరిళ్లిన మిడిల్‌ ఈస్ట్‌ ఇప్పుడు కొంత శాంతించింది. ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇవ్వడంలో ప్రస్తుతం ఇరు వర్గాలు శాంతించాయి. అయితే ఇరాన్‌తో చర్చలు సఫలమవుతున్నాయని అణు ఆయుధాలు తయారు చేయకుండా ఉండడానికి ఆదేశం అంగీకరించదని వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.

కాగా ఇప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా, అమెరికా తన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుండి సుమారు 3,000 మంది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉన్న మెరైన్ బలగాలకు మద్ధతుగా ఈ ఎలైట్ సైనికులు రాబోయే శుక్రవారం నాటికి అక్కడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి లేదా ఇరాన్ యొక్క వ్యూహాత్మక దీవులను నియంత్రించడానికి ఈ బలగాలను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఇరాన్ మూసివేసినట్లు ప్రకటించిన హోర్ముజ్ జలసంధిని తెరిపించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన  82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ చాలా శక్తివంతమైన ఆర్మీగా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ 18 గంటల్లో వీరు చేరుకోగలరు. వీరు పారాచూట్ ద్వారా శత్రువుల ప్రాంతాల్లోకి ప్రవేశించడంలో దిట్టలు.

Advertisement
 
Advertisement
Advertisement