బాగ్దాద్‌లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్‌ | American journalist kidnapped in Baghdad | Sakshi
Sakshi News home page

బాగ్దాద్‌లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్‌

Apr 1 2026 3:00 AM | Updated on Apr 1 2026 3:28 AM

American journalist kidnapped in Baghdad

ఇరాక్‌ బాగ్దాద్‌లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్‌కు గురైంది. ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్‌ను బాగ్దాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయాన్ని ఇరాక్‌ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.

బాగ్దాద్‌లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న (మంగళవారం) సాయంత్రం బాగ్దాద్‌లో రెండుకార్లలో వచ్చిన కిడ్నాపర్లు ఆమెను అపహరించారు. దీనిని గమనించిన భద్రతా బలగాలు వారిని వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలో  కిడ్నాపర్ల వాహనాల్లో ఒకటి బోల్తా పడగా జర్నలిస్టు ఉన్న కారు మాత్రం బాగ్దాద్ దక్షిణ ప్రాంతం వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇరాక్ నిఘా వర్గాలు మరియు క్షేత్రస్థాయి భద్రతా బలగాలు కిడ్నాపర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కిడ్నాప్‌కు గల కారణాలు మరియు దీని వెనుక ఉన్న ముఠాల గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

అయితే ఇదివరకే  అమెరికాలోని  షెల్లీ కిటిల్సన్‌కు పొంచి ఉన్న ముప్పు గురించి ముందే హెచ్చరించింది. ఇరాక్ పర్యటనకు వెళ్లవద్దని ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాక్‌లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో, అమెరికా రాయబార కార్యాలయం కూడా పౌరులకు కిడ్నాప్ ముప్పు పొంచి ఉందని గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. కాగా షెల్లీ కిటిల్సన్ మధ్యప్రాచ్య వ్యవహారాలపై లోతైన కథనాలు రాసే జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement