రెండు అమెరికా ఫైటర్‌ జెట్లు ధ్వంసం.. ట్రంప్‌ రియాక్షన్ ఇదే..! | Donald Trump response to the downing of US jets | Sakshi
Sakshi News home page

రెండు అమెరికా ఫైటర్‌ జెట్లు ధ్వంసం.. ట్రంప్‌ రియాక్షన్ ఇదే..!

Apr 4 2026 5:05 AM | Updated on Apr 4 2026 9:10 AM

Donald Trump response to the downing of US jets

అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ విరుచుకపడుతోంది. ఒక రోజు వ్యవధిలోనే ఆ దేశానికి చెందిన రెండు కీలక ఫైటర్‌ జెట్లను టెహ్రాన్‌ కూల్చివేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.

అమెరికా ఫైటర్‌ జెట్లు టార్గెట్‌గా ఇరాన్‌ దాడులు జరుపుతోంది. 24 గంటల వ్యవధిలో  ఆ దేశానికి చెందిన ఎఫ్‌ 15, ఎఫ్‌ 10 జెట్‌లను కూల్చివేయడంతో పాటు ఎఫ్‌ 35 హెలికాప్టర్‌పై దాడి జరిపింది.  F-15 జెట్‌లో ఫైలట్‌ సైతం ఇరాన్‌ భూభాగంలో పడిపోగా ప్రస్తుతం ఫైలట్‌ కోసం ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.

డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "మనం యుద్ధంలో ఉన్నాం విమానం కూలిపోయినంత మాత్రాన ఇరాన్‌తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలు ఆగిపోవు. యుద్ధంలో ఇలాంటివి సహజం" అని ఆయన అన్నారు. అదే సమయంలో ఇరాన్‌ భూభాగంలో చిక్కుకపోయిన ఫైలట్‌ గాలింపు విషయమై స్పందించడానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం  అమెరికాతో చర్చలు జరపడానికి ఇరాన్ నిరాకరించింది. ఈ మేరకు తమ అధికారులను ఎట్టిపరిస్థితుల్లో ఇస్లామాబాద్ పంపేది లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో చర్చల ప్రయత్నానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ దాడులు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement