
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్‌ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.
2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్‌ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు.
🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022.
Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025