breaking news
truckers
-
వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్ణయం ట్రక్కు డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో కీలక రంగాల్లోని తయారీదారులు, డీలర్లు.. ముఖ్యంగా ఆటోమొబైల్స్, వైట్ గూడ్స్ పంపిణీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ అమలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్ముతున్న తరుణంలో ఈమేరకు సరఫరా స్తంభించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత తిరిగి ఈ వస్తువుల రవాణా ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వేచి ఉండాల్సిందే..జీఎస్టీ 2.0 అమలు దగ్గరపడుతుండడం, త్వరలో ధరలు తగ్గుతాయనే భావనతో కొత్త కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గత వారంలో సరుకు రవాణా రేట్లు 30-35% పడిపోయాయి. సాధారణంగా చెన్నై తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీల కార్ల రవాణా జరుగుతోంది. ఇది గతవారం రోజులుగా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని జోగిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెప్పాయి’ అన్నారు.సరుకు రవాణా పెరిగే అవకాశందిల్లీకి చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ చేతక్ గ్రూప్ డైరెక్టర్ సచిన్ జేకేఎస్ హరితాష్ మాట్లాడుతూ..‘త్వరలో కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో దాదాపు 90 శాతం ట్రక్కులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్వాయిస్లను నిలిపేశారు. నవరాత్రి-దీపావళి సీజన్లో వాహన తయారీదారులు, రిటైలర్లు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి వేగంగా పని చేస్తారు. దాంతో సెప్టెంబర్ 22 నుంచి వస్తు సరఫరాలో రష్ మొదలవుతుంది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, వాహనాల పరిమిత లభ్యత కారణంగా జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా రేట్లు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.డీలర్ల ఎదురుచూపుడీలర్లు సవరించిన జీఎస్టీ బిల్లింగ్ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నందున ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బుకింగ్స్ కొనసాగుతున్నప్పటికీ ఈ వారం డెలివరీలు జరగడం లేదని ఒక ప్రధాన ఆటో డీలర్ షిప్ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ఈ రోజు బుకింగ్ చేసినప్పటికీ కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం బిల్లింగ్ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 22 తర్వాత డెలివరీలు షెడ్యూల్ అవుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: సాఫ్ట్ డ్రింక్స్‌పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన -
ట్రక్స్అప్ ఆధ్వర్యలో ఉచిత కంటి వైద్య శిబిరం
ట్రక్స్అప్ హైదరాబాద్‌లో పూర్తి స్థాయి డిజటల్ సేవల తోపాటు ట్రక్కర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆరోగ్య సేవలను అందిస్తోంది. ఈ మేరకు గురుగ్రామ్‌కు చెందిన ఎఫ్టీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ ట్రక్స్అప్ మే 21, 2025న హైదరాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. లారీ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు శ్రీ పి. శ్రీనివాస్ నేతృత్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. భారతీయ రవాణా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యం తోపాటు చిన్న ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టర్లకు, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించే దిశగా ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషకాహార ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలతో భారతదేశ లాజిస్టిక్స్ వెన్నెముక అయిన ట్రక్కర్ల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ట్రక్స్అప్ నిబద్దతను నొక్కి చెబుతోంది. టెక్నాలజీ పరంగానే కాకుండా వాహనాలు నడిపే వ్యక్తుల జీవితాలను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టడం అనేది అభినందించదగ్గ విషయం అని హైదరాబాద్ లారీ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు పి. శ్రీనివాస్ అన్నారు. అలాగే ఈ కంటి వైద్య శిబిరం ట్రక్కర్ల శ్రేయస్సు, భద్రత పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబించిందని ట్రక్స్హబ్ని కొనియాడారు. కాగా, ఈ ట్రక్స్ హబ్ భారతదేశపు విశ్వసనీయ ట్రక్ మార్కెట్ ప్లేస్ మాత్రమే గాక వాణిజ్య వాహనాల కొనుగోలు, అమ్మకం, మార్పిడిని సులభతరం చేసే ప్రత్యేక వేదిక. (చదవండి: టెక్నో బ్రదర్స్ ‘169పై. ఏఐ’ స్టార్టప్! తొలి యూజర్.. ) -
లక్ష ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ సర్వీసులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష పైచిలుకు ట్రక్ ఆపరేటర్లకు (ట్రకర్లు) డిజిటలీకరణ సేవలు అందించినట్లు టెక్ స్టార్టప్ సంస్థ బ్లాక్‌బక్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ వై తెలిపారు. తమ వ్యాపారాలను పూర్తిగా స్మార్ట్ఫోన్ల ద్వారా నిర్వహించుకోవడానికి, నగదు లావాదేవీలను తగ్గించుకోవడానికి, తమ ట్రక్కులను మరింత మెరుగ్గా నియంత్రించుకోవడానికి, ఆదాయా న్ని మెరుగుపర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో 5,000 పైచిలుకు గ్రామాల్లో తమకు కార్యకలాపాలు ఉన్నాయని, వచ్చే 12 నెలల్లో దీన్ని 15,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాజేశ్ వివరించారు. కొత్త లోడ్ ఆర్డర్లను పొందడం మొదలుకుని జీపీఎస్‌లతో ట్రక్కులను ట్రాక్ చేసుకోవడం, రుణాలు పొందడం వరకు బ్లాక్బక్తో అన్ని రకాల సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. 2015లో రాజేశ్, చాణక్య హృదయ, రామసుబ్రమణియన్ బి కలిసి బ్లాక్‌బక్‌ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు) -
ఎమర్జెన్సీలోనూ ఆగని నిరసనలు.. భారతీయులకు అలర్ట్
కెనడాలో రోడ్డెక్కిన ట్రక్కర్లు.. తగ్గేదేలే అంటున్నారు. రోడ్లను బ్లాక్ చేస్తూ మరీ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అమెరికా కెనడా మధ్య తిరిగే ట్రక్కర్లకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో ఈ ఉద్యమం మొదలై.. తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ఒట్టావా రోడ్ల మీదకు వేలమంది చేరుకుని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిగా దూకుడు చర్యలకు దిగని కెనడా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధింపు ద్వారా ద్వారా ట్రక్కర్లను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాల నడుమ.. కెనడాలో ఉంటున్న భారతీయుల భద్రతపై స్వదేశంలోని వాళ్లు బంధువుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఈ వ్యవహారంపై కెనడాలోని భారత హై కమిషన్ స్పందన కొంచెం ఆలస్యం అయ్యింది. కెనడాలోని భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. నిరసనలు కొనసాగుతున్న మార్గాల గురించి, అక్కడి అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలంటూ భారతీయ పౌరులను కోరుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులు, కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఈ సూచనలు చేసింది కెనడాలోని భారత హై కమిషన్. ట్రక్కర్ల నిరసనల మధ్య కెనడాలోని తమ దేశ పౌరులను 'అలర్ట్‌గా' ఉండాలని మంగళవారం ఆ ప్రకటనలో భారత్ కోరింది. రాజధాని ఒట్టావో సహా టొరంటో, మరికొన్ని ప్రధాన నగరాల్లో ట్రక్కర్ల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రోడ్డు బ్లాకులు, ప్రదర్శనలు, సామూహిక నిరసనలు నడుస్తున్నాయి. ఇది ట్రాఫిక్‌కు అంతరాయం కలిస్తోంది. కాబట్టి, నిరసనలు జరిగే ప్రాంతాల్లో, అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలను, సూచనలను పాటించండి. ఇబ్బంది పడోద్దు. కర్ఫ్యూలు, మీడియా ఇచ్చే సమాచారాన్ని అనుసరించండి. అంటూ ఆ ప్రకటన విడుదలలో పేర్కొంది భారత హై కమిషన్. Advisory for Indian Citizens in Canada or planning travel to Canada- Please take all precautions in light of the ongoing protests and public disturbance in Ottawa and other major Canadian cities. Special #Helpline for distressed Indian citizens in Canada- ☎️ 6137443751 pic.twitter.com/jNLodQuphU — India in Canada (@HCI_Ottawa) February 8, 2022 అంతేకాదు స్పెషల్ ఎమర్జెన్సీ నెంబర్ (+1) 6137443751 ను అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవచ్చని కోరింది. లేదంటే హై కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ద్వారా సాయం కోరవచ్చని సూచించింది. సాయం కోసం, మరింత సమాచారం కోసం టొరంటో, వాకోవర్ కాన్సులేట్స్లను నేరుగా కూడా సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే.. కెనడాలో ట్రక్కర్ల నిరసనతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒట్టావాలో ఎమర్జెన్సీని విధించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసింది. -
UK Bumper Offer : జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాం
-
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
-
వావ్.. నెటిజన్ల ప్రేమను దోచేశారు
లండన్: మానవత్వం పరిమళించింది. తప్పిపోయిన ఓ గున్న ఏనుగు పిల్లను ఆదుకునేందుకు రోడ్డుపై వెళుతున్నవారు చాలా ఓర్పును ప్రదర్శించారు. అది ఏం కోరుకుంటుందో గుర్తించి దానికి తగిన సహాయం చేసి నెటిజన్లతో శబాష్ అనిపించుకున్నారు. బోట్స్వానాలోని ఓ జాతీయ రహదారిపై కార్లోస్ శాంతోస్, జోహాన్ గ్రోన్వాల్డ్, పీటర్ రూసో అనే ముగ్గురు వ్యక్తులు మూడు ట్రక్కుల్లో వెళుతున్నారు. అలా వెళుతున్నవారికి మిట్టమధ్యాహ్నం మండుటెండలో పక్కనే ఉన్న గుబురులో నుంచి బయటకొచ్చి రోడ్డుపై నిల్చున్న చిన్న ఏనుగుపిల్ల కనిపించింది. దానికి సరిగ్గా మూడు వారాలు మాత్రమే ఉంటాయి. అది దాహంతో ఉన్నట్లు గమనించారు. వెనుకాముందు ఆలోచించకుండా కిందికి తమ వద్ద ఉన్న వాటర్ బాటిల్స్‌తో నీళ్లుతాగించారు. అనంతరం ఏనుగుల గుంపు ఆ సమీపంలో ఎక్కడైనా ఉందా అని వెతికి చూశారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆలోచించి తమ ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకొని ఆ గున్న ఏనుగు పిల్లను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. నేరుగా తీసుకెళ్లి బోట్స్వానాలోని అటవీ వన్యమృగ ప్రాణుల సంరక్షణా కేంద్రానికి అప్పగించి అక్కడి అధికారుల ప్రశంసలు దక్కించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆ ఏనుగు పిల్ల అక్కడ ఎంత సంతోషంగా ఉందో కూడా తెలియజేస్తూ ఇంటర్నెట్లో ఓ వీడియోను కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా దానిని చూసినవారంతా వారిని మెచ్చుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.