
ట్రక్స్‌అప్ హైదరాబాద్‌లో పూర్తి స్థాయి డిజటల్ సేవల తోపాటు ట్రక్కర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆరోగ్య సేవలను అందిస్తోంది. ఈ మేరకు గురుగ్రామ్‌కు చెందిన ఎఫ్‌టీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ ట్రక్స్‌అప్ మే 21, 2025న హైదరాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. లారీ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు శ్రీ పి. శ్రీనివాస్ నేతృత్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
భారతీయ రవాణా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యం తోపాటు చిన్న ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టర్లకు, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించే దిశగా ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషకాహార ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలతో భారతదేశ లాజిస్టిక్స్ వెన్నెముక అయిన ట్రక్కర్ల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ట్రక్స్‌అప్ నిబద్దతను నొక్కి చెబుతోంది.
టెక్నాలజీ పరంగానే కాకుండా వాహనాలు నడిపే వ్యక్తుల జీవితాలను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టడం అనేది అభినందించదగ్గ విషయం అని హైదరాబాద్ లారీ సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు పి. శ్రీనివాస్ అన్నారు. అలాగే ఈ కంటి వైద్య శిబిరం ట్రక్కర్ల శ్రేయస్సు, భద్రత పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబించిందని ట్రక్స్‌హబ్‌ని కొనియాడారు. కాగా, ఈ ట్రక్స్ హబ్ భారతదేశపు విశ్వసనీయ ట్రక్ మార్కెట్ ప్లేస్ మాత్రమే గాక వాణిజ్య వాహనాల కొనుగోలు, అమ్మకం, మార్పిడిని సులభతరం చేసే ప్రత్యేక వేదిక.
(చదవండి: టెక్నో బ్రదర్స్ ‘169పై. ఏఐ’ స్టార్టప్! తొలి యూజర్.. )