అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ (Ford Motor) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజిన్ బ్లాక్ హీటర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల యూఎస్ వ్యాప్తంగా దాదాపు 1,19,000 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ఫోర్డ్ ప్రకటించింది. ఈ రికాల్‌లో 2013 నుంచి 2024 మధ్యలో తాయారైన ఫోర్డ్ ఫోకస్, ఫోర్డ్ ఎస్కేప్,లింకన్ ఎంకేసీ, ఫోర్డ్ ఎక్స్‌ఫ్లోరర్ మోడల్స్ ఉన్నాయి.
సమస్య ఏంటంటే?
చలికాలంలో ఇంజిన్ త్వరగా వేడెక్కడానికి బ్లాక్ హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ హీటర్ల వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అమెరికా రహదారి భద్రతా సంస్థ((NHTSA) ఫోర్డ్ మెటార్‌ను హెచ్చరించింది. ఇంజిన్ బ్లాక్ హీటర్‌లో పగుళ్లు రావడం వల్ల కూలెంట్ ఆయిల్ లీక్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది.
ఒకవేళ అదే జరిగితే.. హీటర్‌ను పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు లీక్ అయిన అయిల్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగేందుకు ఎక్కవగా అస్కారం ఉంది.
ఇప్పటివరకు ఈ లోపం వల్ల 12 కార్లలో మంటలు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని, అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఫోర్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. రిపేర్ పూర్తయ్యే వరకు కస్టమర్లు తమ వాహనాలను పవర్ సాకెట్లకు ప్లగ్ ఇన్ చేయవద్దని ఫోర్డ్ కోరింది.


