సాక్షి హైదరాబాద్ : సోమాజిగూడ శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ ఐదవ అంతస్థులో ఉన్న రెస్టారెంట్ లో అగ్గి రాజుకొని మంటలు వ్యాపించాయి దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న వారిని బయిటకి పంపించారు. ఫైర్ ఇంజన్లు మంటలార్పే యత్నం చేస్తున్నాయి. కాంప్లెక్స్ నాలుగవ అంతస్థులో GRT జ్యూవెలర్స్ ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


