గాజాలో శాంతికోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం గాజాలో శాంతికోసమే మాత్రమే కాదని అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే తాజాగా దీనిపై ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలు గాజాలో బలగాలను మెహరిస్తాయంటే తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని ఆ దేశ మంత్రి నిర్ బర్కత్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్త రూపం మెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభేదాలను పరిష్కరిస్తానంటూ బోర్డ్ ఆఫ్ పీస్ పేరుతో ఒక అంతర్జాతీయ శాంతిమండలిని ఏర్పాటు చేశారు. నిన్న దావోస్‌లో జరిగిన మీటింగ్‌లో దీనిని 35 దేశాలతో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక యుద్ధాలను ఆపడమే తరువాయి అంటున్నారు. అయితే ట్రంప్ క్లోజ్ ఫ్రైండైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ తొలుత దీనిని వ్యతిరేకించారు. అనంతరం అంగీకారం తెలిపాడు. ఇప్పుడు తాజాగా ఆదేశ ఆర్థిక మంత్రి దావోస్‌లో ఈ అంశంపై మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ "ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల బలగాలని గాజాలో మెహరించడానికి మేము ఒప్పుకోం. ఖతర్, టర్కీ దేశాల బలగాల్ని మేము ఆమెదించం ఎందుకంటే వారా గాజాలోని జిహాది ఆర్గనైజేషన్లకు మద్దతిస్తారు. వారు అక్కడ కాలుమోపితే మేము నమ్మం వారు ట్రంప్‌కు చెందిన సంస్థలో ఉన్న మేము పట్టించుకోం" అని బర్కత్ అన్నారు. ప్రస్తుతం ఒక మంచి ప్రతిపాదనతో ముందుకెళ్తున్నారు. అయితే హమాస్ పరిస్థితి ఏంటి దానిని ఖచ్చితంగా నాశనం చేయాల్సిందే అన్నారు.
దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఏదైనా దేశం పరస్పరం సహకరించుకుంటాయన్నారు. అందుకే గాజాలో పాకిస్థాన్ బలగాల్ని తాము నమ్మకమైన అంగీకరమైన భాగస్వామిగా చూడడం లేదన్నారు. అయితే నిన్న ( గురువారం) దావోస్‌లో పాకిస్థాన్ డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరడానికి అంగీకారం తెలిపింది. కాగా ఇదివరకూ జరిగిన ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ గాజాలో శాంతి కోసం తమ బలగాల్ని మెహరించాల్సి ఉంటుంది


